Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో రొమాంటిక్, బ్యూటిఫుల్ కపుల్ గా పేరు సంపాదించుకున్న సమంత, నాగచైతన్య 4 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. ఎంతో సంతోషంగా ఉందనుకున్న వీరి జీవితంలో మనస్పర్ధలు రావడం ద్వారా విడాకుల ప్రకటన చేశారు. ఇలా నాగచైతన్య, సమంత విడాకుల ప్రకటన చేసిన అనంతరం వారి కెరీర్ పై పూర్తి దృష్టిని సారించి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే సమంత టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్ అనే వ్యత్యాసం లేకుండా అన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే ఈమె తమిళంలో ఒక సినిమాలో నటించగా తెలుగులో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ ఎంట్రీకి కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈమె హాలీవుడ్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆరేంజ్‌మెంట్ ఆఫ్ లవ్ పేరుతో ఫిలిప్ జాన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.
తాజాగా సమంత ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తాను ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఏం మాయ చేశావె సినిమా కోసం ఆడిషన్స్ కి వెళ్లానని, అప్పటి నుంచి ఏ సినిమా ఆడిషన్స్ కి వెళ్ళలేదని అయితే ఈ హాలీవుడ్ సినిమా ఆడిషన్స్ లో పాల్గొనాలని తెలియడంతో తాను ఎంతో భయపడ్డానని తెలిపింది. ఏం మాయ చేశావె సినిమా షూటింగ్ సమయంలో తనకు ఎలాంటి ఫీలింగ్ ఉందో.. ప్రస్తుతం అదే ఫీలింగ్ ఉందని.. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని భయపడుతున్నానని.. ఆమె తెలియజేసింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…