Samantha : నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవడం ఏమో గానీ.. వారిద్దరూ విడిపోయేందుకు చాలా వరకు సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్ కారణమని అభిమానులు తిట్టిపోస్తున్నారు. ఇప్పటికే సమంత ఓ పోస్టు ద్వారా ఇక విమర్శలు ఆపాలని కోరింది. అయినప్పటికీ ఆమె అభిమానులు మాత్రం ప్రీతమ్‌ను తిట్టడం ఆపడం లేదు.
సమంత వైట్ కలర్ డ్రెస్ ధరించిన ఓ ఫోటోను ప్రీతమ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. అయితే ఆ పోస్టు కింద కామెంట్ సెక్షన్ మొత్తం సమంత అభిమానుల తిట్లు, విమర్శలతో నిండిపోయింది. దీంతో సమంత అభిమానులు ప్రీతమ్‌పై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్లు ఆ కామెంట్లను చూస్తే అర్థమవుతుంది.
https://www.instagram.com/p/CUwBoaGI8Z6/?utm_source=ig_web_button_share_sheet
సమంత, నాగచైతన్యల జీవితాల్లోకి ప్రవేశించావు, వారి మధ్య చిచ్చు పెట్టావు.. ఇంక చాలు, ఆపు.. తప్పుకో.. అంటూ సమంత అభిమానులు ప్రీతమ్‌ను దారుణంగా విమర్శిస్తూ తిడుతున్నారు. అయితే ప్రీతమ్ మాత్రం దీన్ని మానసిక వేదనగా ఇదివరకే చెప్పాడు. మరి ఈ విమర్శలు ఎప్పటికి ఆగుతాయో చూడాలి.