గత కొంత కాలంగా సమంత మయోసైటిస్ అనే తీవ్ర సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా వెళ్లిన సమంత కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంది. ఇండియాకు వచ్చీ రాగానే ఒక డాగ్ ఫుడ్ యాడ్ చేసింది. అందులో ఆమె పూర్తిగా మారిపోయిన ముఖాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తన ముఖానికి సర్జరీ చేయించుకుందని.. అందుకనే చాలా కాలం పాటు అందరికీ దూరంగా ఉందని అర్థమైంది. అయితే ఆ తరువాత వెంటనే ఆమె హాస్పిటల్‌లో చేరి అందరినీ షాక్‌కు గురి చేసింది.
హాస్పిటల్ బెడ్‌పై తన కొత్త సినిమా యశోదకు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను సమంత షేర్ చేసింది. అలాగే తనకున్న వ్యాధి వివరాలను కూడా పోస్ట్ లో పెట్టింది. తనకు మయోసైటిస్ ఉందని, చికిత్స తీసుకుంటున్నానని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. దీంతో ఆమె పోస్ట్ వైరల్ కాగా.. అందరూ ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ ఆమెకు బెస్టాఫ్ లక్ చెబుతూ పోస్టులు పెట్టారు. అయితే ప్రస్తుతం సమంత హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయింది. ఈ క్రమంలోనే ఓ ఫొటోషూట్ కూడా చేసింది. అందులో ఆమె నలుపు రంగు దుస్తులను ధరించి అద్దాలు పెట్టుకుని ఉంది. తన రాబోయే సినిమా యశోద కోసం ఆమె ప్రమోషన్స్ నిర్వహిస్తుందని తెలుస్తోంది.
అందులో భాగంగానే ఆమె యాంకర్ సుమతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా చేసిందట. అది త్వరలోనే ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇక సమంత నటించిన యశోద మూవీ ఈ నెల 11వ తేదీన రిలీజ్ కానుండగా.. ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇందులో భ్రూణ హత్యలు, సరోగసి వంటి అంశాలు ఉన్నట్లుగా ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. ఇక నాగచైతన్య నుంచి విడిపోయాక సమంత నటించిన తమిళ మూవీ కాతు వాకుల రెండు కాదల్ రిలీజ్ అయి ఫెయిల్ కాగా.. ఇప్పుడు విడుదలవుతున్న యశోద మూవీ రెండవది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన ఇస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…