Samantha : సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుని విడిపోవడం ఏమోగానీ.. న్యూస్ చానళ్లు, పత్రికలు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానల్స్‌కు చేతినిండా పని దొరికిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సమంత మీదే ఎక్కువగా మండిపడుతున్నారు. అన్నింటికీ ఆమే కారణమని ఆమెను నిందిస్తున్నారు. కొన్ని యూట్యూబ్ చానల్స్ అయితే ఆమెను టార్గెట్‌గా చేసి చిలవలు పలవలుగా కథలు అల్లి వీడియోలను పోస్ట్ చేశాయి. దీంతో ఆ చానల్స్ ఇప్పుడు పరువు నష్టం కేసును ఎదుర్కొంటున్నాయి.
అయితే కోర్టులో కేసు విచారణలో ఉంది కానీ.. జడ్జి ఏ తీర్పు వెలువరిస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి కేసు విచారణను శుక్రవారంకు వాయిదా వేశారు. నటిగా సమంత బిజీ కనుక త్వరగా కేసును ముగించాలని ఆమె తరఫు న్యాయవాది జడ్జిని కోరారు. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానమే అని, ఇతర పరువు నష్టం కేసుల్లాగే సమంత కేసును కూడా విచారిస్తామని, తొందర పడబోమని జడ్జి చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం మరోమారు జడ్జి వాదనలను విన్నారు.
అయితే ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. సోమవారం మరోసారి వాదనలను విన్న తరువాత తీర్పును వెలువరిస్తామని చెప్పారు. అయితే పరువు నష్టం కేసులో క్షమాపణలు చెప్పాలి అని కోరాలి గానీ.. డబ్బులు అడగడమేమిటని జడ్జి సమంతను ప్రశ్నించారు. దీంతో వారు క్షమాపణలు కోరడంతోపాటు సదరు యూట్యూబ్ చానల్స్ పోస్ట్ చేసిన వీడియోల తాలూకు లింక్‌లను కూడా డిలీట్ చేయాలని కోరారు.
అయితే ఈ కేసులో జడ్జి ఏమని తీర్పు చెబుతారా ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విచారణను ఎదుర్కొంటున్న చానల్స్ వారు క్షమాపణలు చెప్పేందుకు అంగీకరిస్తే ఓకే. లేదంటే జడ్జి ఇచ్చే తీర్పుపై వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…