Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంతపై పెద్ద ఎత్తున పుకార్లు వచ్చాయి. అయితే తరువాత అవన్నీ అబద్దాలేనని తేలిపోయాయి. అలాగే ఈ జంటపై ఎప్పటికప్పుడు కొత్త కొత్త వార్తలు బయటకు వస్తూనే ఉన్నాయి. అసలు వీరిద్దరూ ఎందుకు విడిపోయారు ? అనే విషయం ఇంత వరకు తెలియలేదు, కానీ సమంతకు చెందిన పాత పోస్టులను మాత్రం తెగ వైరల్ చేస్తున్నారు.

గతంలో ఓ నెటిజన్ సమంతను తనను పెళ్లి చేసుకోవాలని.. నాగచైతన్యకు విడాకులు ఇవ్వాలని అడిగాడు. అందుకు సమంత బదులిస్తూ.. ఆ విషయం చైతూనే అడగమని చెప్పింది. అయితే అప్పట్లో ఆమె విడాకులపై సరదాగా చేసిన కామెంట్ ఇప్పుడు నిజమైందని అంటున్నారు. ఈ క్రమంలోనే సమంత పాత పోస్టును ఇప్పుడు మళ్లీ వైరల్ చేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత ప్రస్తుతం కాతువాకుల రెండు కాదల్ అనే తమిళ మూవీలో నటించింది. ఈ మూవీ ఏప్రిల్‌లో విడుదల కానుంది. ఇక యశోద అనే పాన్ ఇండియా మూవీతోపాటు శాకుంతలం అనే సినిమాలోనూ సమంత నటించింది. త్వరలో ఓ వెబ్ సిరీస్‌తోపాటు ఓ బాలీవుడ్ మూవీలోనూ సమంత నటిస్తుందని తెలుస్తోంది.