Samantha : స్టైలిష్ స్టార్‌గా అల్లు అర్జున్ ఎంత ఫేమస్ అయ్యాడో, ఆయన సతీమణి స్నేహా రెడ్డి కూడా అంతే గుర్తింపు తెచ్చుకుంటోంది. అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. హీరోల సతీమణుల్లో కెల్లా అల్లు స్నేహారెడ్డికి ఆ మధ్య అరుదైన గుర్తింపు లభించింది. మొత్తం సెలబ్రిటీల భార్యల్లో అల్లు స్నేహారెడ్డికి మాత్రమే ఎక్కువ మంది ఫాలోవర్లున్నారు.
నాలుగు మిలియన్ల ఫాలోవర్లతో టాప్‌లో నిలిచిన స్నేహారెడ్డి.. నమ్రత, ఉపాసన వంటి వారిని సైతం వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. తనకి సంబంధించిన ప్రతీ విషయాన్ని తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ ఉండే స్నేహ రెడ్డి తాజగా బ్లాక్ శారీలో దిగిన ఒక ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేశారు. దీనికి ‘వేరింగ్ ఆల్ బ్లాక్’ అనే కేప్షన్ కూడా ఇచ్చారు.
మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన ఆ శారీకి జుకాల్కర్ స్టైలింగ్ ను యాడ్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటోకి సమంత కూడా తన కామెంట్ ను యాడ్ చేసింది. ‘హాట్’ అని కామెంట్ చేసి.. దాని పక్కన ఫైర్ ఎమోజీని పెట్టింది. దీంతో ఈ పిక్ మరింతగా వైరల్ అవుతోంది. కాగా, స్నేహా రెడ్డి భర్త బన్నీ నటించిన పుష్పలో సామ్ స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే.