Samantha : గత కొద్ది రోజుల నుంచి అక్కినేని సమంత గురించి వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఆమె స్పందించకపోవడంతో ఆ వార్తలలో నిజం ఉందని చాలా మంది భావించారు. సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ రావడం వల్ల తను ముంబైలో ఇల్లు కొనుక్కుని త్వరలోనే ముంబైలో సెటిల్ అయిపోతుంది అంటూ.. అందుకు నాగచైతన్య ఒప్పుకోక పోవడం వల్లే వీరిద్దరి మధ్య గొడవలు చోటుచేసుకొని విడాకులకు దారి తీశాయంటూ పెద్దఎత్తున వార్తలు షికార్లు చేశాయి.

గత కొద్దిరోజుల నుంచి వీరి గురించి వస్తున్న పుకార్లపై తాజాగా సమంత స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. తను సినిమాల్లో మాత్రమే కాకుండా సాకీ అనే వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించి సంవత్సరం కావడంతో ఈ సందర్భంగా ఆమె అభిమానులతో ముచ్చటించి అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ మీరు ముంబైకి షిఫ్ట్ అవుతున్నారు అంట కదా ఎంత వరకు నిజం ఉందని ప్రశ్నించాడు.
https://www.instagram.com/reel/CUZJT-FJ0jt/?utm_source=ig_web_copy_link
ఈ ప్రశ్నకు సమంత స్పందిస్తూ తన ఇల్లు హైదరాబాద్ లోనే ఉందని, తన హోమ్ టౌన్ హైదరాబాద్ అని, నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చిన హైదరాబాద్ ను వదిలి ఎక్కడికి వెళ్ళలేనంటూ సమంత ఈ సందర్భంగా తన గురించి వస్తున్న వార్తలకు క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే గతంలో ఒక జ్యోతిష్కుడు వీరిద్దరూ విడిపోతారని సమంత ముంబైకి షిఫ్ట్ అవుతుందంటూ చెప్పడంతో ఈ వార్తలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.