Samantha : ప్రస్తుత తరుణంలో సమంత పేరు సోషల్ మీడియాలో, వార్తల్లో మారుమోగిపోతోంది. ఈమె ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్వహించిన కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని తన వైవాహిక జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించింది. అలాగే సినిమాల గురించి కూడా చెప్పింది. కానీ ఆమె చేసిన వ్యాఖ్యలే దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న సమంత అందులో కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్ అయ్యారట కదా.. అని అడగ్గా.. అందుకు ఆమె నవ్వుతూ బదులిస్తూ.. అవును.. నేను డబ్బులిచ్చి నంబర్ వన్ హీరోయిన్ అయ్యా.. అని బదులు చెప్పింది. అయితే ఆమె నిజంగానే ఓర్ మాక్స్ అనే సంస్థ ఇచ్చిన రేటింగ్స్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా నిలిచింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఆమె నిజంగానే ఇందుకు గాను డబ్బులు ఇచ్చిందా.. అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఆమె షోలో యాదృచ్చికంగానే అలా అని ఉంటుందని.. ఆమె నంబర్ వన్ అవడం ఆమెకు ముందుగా తెలియకపోవచ్చని.. అంటున్నారు.
ఇక సమంత కరణ్ జోహార్ షోలో మాట్లాడుతూ.. తన భర్త చైతూను మాజీ భర్త అని సంబోధించాలని చెప్పింది. దీంతో కరణ్ జోహార్ సారీ కూడా చెప్పారు. అయితే ఇందుకు అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత మరీ విడ్డూరంగా ప్రవర్తిస్తుందని.. కానీ ఆమె గురించి చైతూ మాత్రం చాలా కూల్‌గానే బదులిస్తున్నాడని.. ఆయనకు, ఆమెకు ఎంతో తేడా ఉందని అంటున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే సమంత బ్యాక్ టూ బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. శాకుంతలం, యశోద, ఖుషితోపాటు తెలుగు, తమిళంలోనూ ఓ బైలింగ్వల్ మూవీలో నటిస్తోంది. అలాగే హిందీలోకి ఎంట్రీ ఇస్తూ ఆయుష్మాన్ ఖురానాతో ఓ చిత్రానికి ఓకే చెప్పింది. అలాగే అక్షయ్ కుమార్‌తోనే మరో సినిమాకి కన్ఫమ్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ మూవీని మైథలాజికల్ స్టోరీగా తెరకెక్కించనున్నారని సమాచారం. దీంతోపాటు మరో అంతర్జాతీయ మూవీలోనూ సమంత నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…