Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న వారిలో సమంత ఒకరు. ఈమె పెళ్లయిన తర్వాత కూడా వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమంత కెరియర్ కు విడాకులు సమస్య కానున్నాయి.. అంటూ పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
సమంత విడాకులు తీసుకున్నప్పటికీ తాను మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా.. కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుందనే సమాచారం వినబడుతోంది. దీనితోపాటు మరో రెండు ప్రాజెక్టులకు కూడా సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి కొద్దిరోజుల్లోనే ఈ సినిమాల గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నారు.
ఇదిలా ఉండగా చాలా మంది దర్శక నిర్మాతలు సమంతకు సూట్ అయ్యే కథలు వారి వద్ద ఉన్నాయని.. అయితే సమంత విడాకులు తీసుకున్న తరువాత ఆమెతో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఒకవేళ సమంతకు సినిమా అవకాశాలు ఇస్తే అక్కినేని కుటుంబంతో ఉన్న రిలేషన్ దెబ్బతింటుందన్న భావనలో చాలా మంది దర్శక నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది.