Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా నటించిన బంటీ ఔర్ బబ్లీ 2 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కపిల్ శర్మ షోలో సైఫ్ అలీఖాన్ సందడి చేశారు. సైఫ్ అలీఖాన్ తో పాటు రాణీ ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేది, శర్వానీలు కూడా ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
ఈ ప్రోమోలో కపిల్ శర్మ.. సైఫ్ అలీఖాన్ తో ఫన్నీ డిస్కషన్ చేశారు. సైఫ్ తాండవ్, భూత్ పోలీస్, బంటీ ఔర్ బబ్లీ 2 లాంటి వరుస సినిమాలేంటి అని కపిల్ శర్మ.. సైఫ్ అలీఖాన్ తో అన్నారు. వరుస సినిమాలు చేయడం ప్రేక్షకులకు ఆనందంగా ఉందని, అయితే మీకు పని అంటే ఇష్టమా.. లేక రెండో కొడుకు పుట్టిన తర్వాత ఫ్యామిలీ కోసం ఎక్కువగా కష్టపడుతున్నారా అంటూ సైఫ్ ను ప్రశ్నించారు.
https://www.youtube.com/watch?v=6CPLhgfcfa0
ఈ క్వశ్చన్ కు సైఫ్ అలీఖాన్ కాస్త ఫన్నీ సమాధానం ఇచ్చారు. ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువమంది పిల్లలు పుట్టేలా ఉన్నారని, ఆ భయంతోనే ఇలా సినిమాలతో బిజీగా ఉన్నట్లు సైఫ్ తెలిపారు. ఈ ఆన్సర్ తో కపిల్ శర్మతోపాటు బంటీ ఔర్ బబ్లీ టీమ్, ప్రేక్షకులు కూడా కడుపుబ్బా నవ్వారు. సైఫ్ అలీఖాన్ నటించిన ఈ సినిమా గురించి ఫుల్ ప్రమోట్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.