Sai Rajesh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత ప్రత్యేకమో వేరే చెప్పాల్సిన పనిలేదు. పవన్ చేసే ఏ పనికి అయినా సరే ఫ్యాన్స్ సపోర్ట్ వీర లెవల్‌లో ఉంటుంది. పవన్ అనే కాదు.. ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే అలాగే ఉంటారు. అయితే పవన్‌కు ఒక రాజకీయ పార్టీ కూడా ఉంది. కానీ ఇతర హీరోలకు లేదు. అయితే ఈ విషయంలోనే ఓ దర్శకుడు పవన్ ఫ్యాన్స్‌పై కామెంట్స్ చేశారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయనను భారీగా విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
పవన్ కల్యాణ్‌కు చెందిన సినిమాలు వస్తే ఆయన ఫ్యాన్స్ నానా హంగామా చేస్తారు. కానీ ఆయన పార్టీ అయిన జనసేన కోసం ఏదైనా పిలుపునిస్తే వపన్ ఫ్యాన్స్ ఎందుకు స్పందించరు ? ఈ విషయంలో వారు ఎందుకు అంత లేజీగా.. బద్దకంగా ఉంటారు.. అని దర్శకుడు సాయి రాజేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసిన ఆయన కొద్ది సేపటి తరువాత వెంటనే తాను పొరపాటున ట్వీట్ చేశాని.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని అన్నారు. కానీ అప్పటికే ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. ఆయనను దారుణంగా విమర్శిస్తున్నారు.
కాగా సాయి రాజేష్ వాస్తవానికి మెగా హీరోలు అందరికీ పెద్ద ఫ్యాన్. ఆయన చిన్న సినిమాలకు దర్శకుడు అన్న మాటే కానీ.. ఎంతో మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబుకు చెందిన సినిమాలను తీసి ఆయన ఫేమస్ అయ్యారు. అయితే ఉన్నట్లుండి సాయి రాజేష్ ఇలా పవన్ ఫ్యాన్స్‌ను ఎందుకు కెలికారన్నది అంతుబట్టడం లేదు. కానీ ఆయనను మాత్రం పవన్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు. మరి చీమల పుట్టను కదిపితే అవి ఊరుకుంటాయా.. కుట్టే దాకా విడిచిపెట్టవు. ఇక ఫ్యాన్స్ ఫైర్ ఎప్పుడు చల్లారుతుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…