Sai Pallavi : సాయిపల్లవి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటిగానే కాక తన వ్యక్తిత్వం పరంగా కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్‌కు చెందిన కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయాలని చెప్పి.. రూ.కోట్లు ఇస్తామని ఈమె దగ్గరకు వచ్చాయి. అయినప్పటికీ తాను సహజసిద్ధమైన అందాన్నే ఇష్టపడతానని.. కనుక అలాంటి ప్రొడక్ట్స్‌ను ప్రచారం చేయలేనని చెప్పేసింది. ఇక ఇటీవలే మరో కంపెనీకి చెందిన భారీ ఆఫర్‌ను కూడా ఈమె సున్నితంగా తిరస్కరించింది. అయితే సాయిపల్లవికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు. కానీ వచ్చిన వాటిని కూడా ఆమె సద్వినియోగం చేసుకోవడం లేదని విశ్లేషకులు అంటున్నారు. అలాగే సినిమాల ఎంపికలోనూ సాయిపల్లవి జాగ్రత్త పడడం లేదని అంటున్నారు.
సాయి పల్లవి నటించిన విరాట పర్వం మూవీ వాస్తవానికి ఈ తరం చూసేదికాదు. ఇలాంటి సినిమాలను ఇప్పుడు ప్రేక్షకులు చూడడం లేదు. అలాగే ఈమె నటించిన గార్గి అనే మరో మూవీ కూడా త్వరలో రిలీజ్ అవుతోంది. ఇది కోర్టుల నేపథ్యంలో సాగే సినిమా అని తెలుస్తోంది. ఇందులో కులాలు, వివక్ష మీద చూపిస్తారట. అయితే ఇలా సాయి పల్లవి సినిమా సెలెక్షన్‌లోనూ తప్పు చేస్తుందని అంటున్నారు. విరాట పర్వం లాంటి సినిమానే గార్గి అని.. ఈ తరహా సినిమాలను ప్రేక్షకులు చూడడం లేదని.. ఈమె సినిమాల ఎంపికపై మరింత శ్రద్ధ వహించాలని అంటున్నారు.
సాయిపల్లవి ఒక రకంగా ఇలాంటి సినిమాలను చేస్తుండడం ద్వారా తన కెరీర్‌ను తానే నాశనం చేసుకుంటుందని అంటున్నారు. హీరోయిన్లు కమర్షియల్ ధోరణిలో ఆలోచించాలని.. సినిమాల ఎంపికలో జాగ్రత్తలు పాటించకపోతే కెరీర్ పతనం అవుతుందని.. సాయిపల్లవి కెరీర్ ఇప్పుడు అలాంటి స్థితిలోనే ఉందని.. ఇకనైనా జాగ్రత్తగా సినిమాలను ఎంపిక చేసుకుని చేయకపోతే.. ఆమె కెరీర్ ఇంతటితోనే ముగుస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా.. ఒక రకంగా చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తోంది. సాయిపల్లవి గ్లామర్ షో చేయడంలో హద్దులు పెట్టుకుంది. కరెక్టే. కానీ సినిమాల విషయంలో అయినా సరే కాస్త పట్టు విడుపులు ఉండాలి. లేదంటే తోటి హీరోయిన్లతో ఈ కాలంలో పోటీ పడడం కష్టమే. మరి ముందు ముందు ఆమె ఎలాంటి సినిమాలను చేస్తుందో చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…