Sai Pallavi : సాయిపల్లవి.. ఫిదా మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి తన నటనతో అందరినీ ఫిదా చేసింది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తన నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటి సాయి పల్లవి. హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కూడా సాయి పల్లవే. సాయి పల్లవిని టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తారు. తనకు కథ నచ్చకపోతే అవతల వ్యక్తి స్టార్ హీరో అయినా సరే.. ఆ మూవీను రిజెక్ట్ చేస్తుంది సాయి పల్లవి.
అయితే ఇటీవల సాయి పల్లవి తీసే సినిమాల కారణంగా ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారని ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని భావించిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ క్రమంలోనే సాయి పల్లవి ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. టాలీవుడ్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా హరిహర వీరమల్లు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెయిన్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో మరో స్టార్ హీరోయిన్ కోసం చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవి నటించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సీన్స్ మూవీకే హైలెట్ అవుతాయి అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరు పవర్ స్టార్ లను ఒకే తెరపై చూడబోతున్నాం అన్నమాట. ఇది పవన్, పల్లవి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పిస్తుంది. అలాగే క్రిష్ వీళ్లిద్దరి కాంబోలో ఓ సాంగ్ కూడా ప్లాన్ చేశాడట. నిజంగా ఇది సాయి పల్లవి, పవర్ స్టార్ అభిమానులకు కేక పెట్టించే అప్డేట్ అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ నిజంగా సాయి పల్లవి హరిహర వీరమల్లులో నటిస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద పవన్ కి మరో బ్లాక్ బస్టర్ పక్కా అంటున్నారు జనాలు.