Sai Dharam Tej : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10వ తేదీన రాత్రి మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ ప్రాంతంలో స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ.. అదుపు తప్పి కింద పడ్డ విషయం తెలిసిందే. స్థానికులు వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు. కాలర్ బోన్ విరగడంతో అపోలో బృందం విజయవంతంగా సర్జరీ నిర్వహించింది. కొద్ది రోజులుగా తేజ్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
తేజ్ ఆరోగ్యంపై అభిమానులు ఆరాలు తీస్తూనే ఉన్నారు. పలు మీడియా సంస్థలు కూడా సాయి తేజ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటున్నారు. తాజాగా నాగబాబు ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సాయి ధరమ్ ఆరోగ్యంపై క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడని చెప్పారు. “తేజ్ ఆరోగ్యం బాగుంది. ఫిజియోథెరపీ జరుగుతోంది. మరో 30-45 రోజుల్లో సాధారణ స్థితికి వస్తాడు. అతను రెండు నెలల్లో షూటింగ్‌లకు కూడా హాజరు కావచ్చు. మరికొంత కాలం విశ్రాంతి తీసుకోమని మేము అతనికి సలహా ఇస్తున్నాము” అని నాగబాబు అన్నారు.
రీసెంట్‌గా సాయి ధరమ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ థంబ్ సైన్ చూపిస్తూ ట్వీట్ చేశారు. కష్టసమయంలో అభిమానులు, ఆప్తులు, స్నేహితులు చూపించిన ప్రేమ, అభిమానానికి ‘థాంక్స్’ అనే పదం చిన్నదవుతుందని పేర్కొన్నాడు. తన రిపబ్లిక్ మూవీని ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపాడు. త్వరలో అందర్నీ కలుస్తానంటూ ట్వీట్ ముగించాడు. కాగా సాయి తేజ్ హీరోగా దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన రిపబ్లిక్ సినిమా అక్టోబర్ 1న విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…