Sai Dharam Tej : సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి కాలర్ బోన్ సర్జరీ చేయడంతో కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుందని వెంటిలేటర్ సహాయం లేకుండా కోలుకుంటున్నాడు.. అంటూ కుటుంబ సభ్యులు వెల్లడించారు. సాయి తేజ్ ను చూడటానికి వెళ్ళిన వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి తేజ్ ఇప్పటికీ కళ్ళు తెరవలేదని చేసిన వ్యాఖ్యలు కొంత వరకు అభిమానులకు కంగారు పుట్టించాయి. ఇంతవరకు తన ఆరోగ్యం బాగుందని కోలుకుంటున్నారని చెప్పగా పవన్ కళ్యాణ్ మాత్రం సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని కళ్ళు కూడా తెరవలేదు అని చెప్పడంతో అతని ఆరోగ్యం గురించి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవకట్టా.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంపై స్పందిస్తూ అతని ఆరోగ్యం బాగుందని, అతనిని కలిసి ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీ విడుదల చేయాలని అడగగా అతను ఓకే చెప్పినప్పుడే ఈ సినిమాను విడుదల చేయాలని భావించామని, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సాయిధరమ్ తేజ్ చూశాడని.. దేవకట్టా చెప్పడంతో అభిమానులలో ఆందోళన పెరిగింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయి ధరమ్ తేజ ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అసలు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంలో ఏదో దాస్తున్నారని.. ఆయన ఆరోగ్యం గురించి నిజం చెప్పాలని అభిమానులు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కోరుతున్నారు.