Sai Dharam Tej : దసరా పండుగ రోజు మెగా ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్ న్యూసే అని చెప్పవచ్చు. ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు ఇంటికి చేరుకుంటున్నారు. మాదాపూర్ దుర్గం చెరువు కేబల్ బ్రిడ్జిపై బైక్ యాక్సిడెంట్‌కు గురైన సాయిధరమ్ తేజ్‌కు కాలర్ బోన్ శస్త్ర చికిత్స చేశారు. తరువాత కొన్ని రోజుల పాటు కోమాలో ఉన్నాడు. అయితే ఎట్టకేలకు పూర్తిగా కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ను అపోలో వైద్యులు ఇంటికి పంపిస్తున్నారు.
దసరా పండుగ రోజు సాయి ధరమ్ తేజ్ డిశ్చార్జి అవుతుండడం మెగా ఫ్యాన్స్ కు ఆనందాన్ని ఇస్తోంది. వారు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ బర్త్ డే కూడా ఇదే రోజు కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. హాస్పిటల్‌లో విషమ స్థితిలో చికిత్స పొందిన సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అవుతుండడం మెగా ఫ్యామిలీకి కూడా ఆనందాన్నిస్తోంది.
అయితే సాయిధరమ్ తేజ్ హాస్పిటల్‌లో ఉన్నప్పుడే ఆయన సినిమా రిపబ్లిక్ విడుదల అయింది. విమర్శకుల నుంచి కూడా ఈ మూవీ ప్రశంసలను అందుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మూవీ మెసేజ్ ఓరియెంటెడ్ అయి ఉండడమే దీనికి కారణమని, రివ్యూలు పాజిటివ్‌గా ఉన్నా ప్రేక్షకులు సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపించడం లేదని అర్థమైంది. అయితే సాయి ధరమ్ తేజ్ మాత్రం ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తుండడం.. నిజంగా హ్యాపీ న్యూసే అని చెప్పవచ్చు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…