Radhe Shyam : బాహుబలి, సాహో సినిమాల తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్, పూజ హెగ్డె జంటగా నటించిన రాధేశ్యామ్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక ఈ సినిమాకు దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభాస్, పూజాహెగ్డె రాధేశ్యామ్ చిత్రానికి ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సరికొత్త ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్ల వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సోషల్ మీడియాను ఉపయోగించుకొని తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రజలలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమా క్రేజ్ ను ఉపయోగించుకొని ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం అని తెలియజెప్పేలా ట్వీట్ చేశారు. రాధేశ్యామ్ సినిమా పోస్టర్ తో ఉన్న ఈ మీమ్ విపరీతంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
#TSRTC బస్సులోనే వెళ్దాం అంటున్నా #RadheShyam Choose TSRTC & Encourage the #publictransport
@TSRTCHQ @TV9Telugu @SakshiHDTV @ntdailyonline @News18Telugu @baraju_SuperHit @telugufilmnagar @Sreeram_singer @puvvada_ajay @Govardhan_MLA @TeluguBulletin @ChaiBisket @boxofficeindia pic.twitter.com/3QuEsYqN9i— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 10, 2022
ఇంతకీ ఈ పోస్టర్ లో ఏముందనే విషయానికి వస్తే.. ప్రభాస్, పూజ హెగ్డె ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా రోజుల తరువాత కనీసం ఏదైనా టూర్ వెళ్దాం అంటూ ప్రభాస్ ప్లాన్ చేస్తాడు. అందుకు పూజా హెగ్డె.. వెళ్దాం.. కానీ ఆర్టీసీలోనే వెళ్దాం.. అంటూ చెప్పుకొచ్చింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంతో సురక్షితం అంటూ పూజా హెగ్డె చెప్పింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు ఈ ట్వీట్ పై స్పందిస్తూ సజ్జనార్ ఐడియా మామూలుగా లేదుగా.. అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేయగా, మరికొందరు సజ్జనార్ ఆర్టీసీ సేవలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి చేస్తున్న ప్రయత్నంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.