RRR : ఓటమెరుగని విక్రమార్కుడు రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ మూవీ ఆర్ఆర్ఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నమే ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్‌డేట్ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారి సంచలనం సృష్టిస్తోంది.
రీసెంట్‌గా చిత్రం నుండి గ్లింప్స్ విడుదల కాగా, ఇది ప్రేక్షకులకి సరికొత్త వినోదాన్ని పంచింది. ఈ గ్లింప్స్‌తో మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఇన్నాళ్లూ మూవీకి సంబంధించి ఎలాంటి లీకులు బయటకు రాకుండా మేకర్స్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ ఫోటో బయటకు రావడంతో అందరిలోనూ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
లీక్డ్ ఫొటోలో ఎన్టీఆర్ తలకు పాగా, వెనుక తుపాకీ తగిలించుకొని దర్జాగా కూర్చున్నారు. ఎన్టీఆర్‌ని ఎప్పుడూ ఇలా చూడకపోవడంతో ఫ్యాన్స్‌కి ఈ ఫొటో థ్రిల్‌ని కలిగిస్తోంది. 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ దసరాకే సినిమాను విడుదల చేయాలని తొలుత భావించినా కొన్ని అనివార్య కారణాలతో సినిమా విడుదలను వచ్చే ఏడాది జనవరి 7కు వాయిదా వేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…