RRR Trailer : బాహుబలి సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో ఆర్ఆర్ఆర్ అనే మల్టీ స్టారర్ ను తెరకెక్కించారు. ఈ సినిమా జనవరి 7న విడుదల కానుండగా, చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్‌లు, రోమాలు నిక్కబొడిచే సన్నివేశాలు, ప్రతి భారతీయుడిలోనూ ప్రేరణ నింపేలా సాగిన డైలాగ్‌లతో ట్రైలర్ అదిరిపోయింది.
‘భీమ్.. ఈ నక్కల వేట ఎంతసేపు.. కుంభస్థలాన్ని బద్దలుకొడదాం రా’’ అంటూ రామ్‌చరణ్ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తోంది. రామరాజుగా రామ్ చరణ్.. భీమ్ గా తారక్ అదరగొట్టారని ట్రైలర్ చూసి చెప్పొచ్చు. జనవరి 7వ తేదీన జరగబోయే విధ్వంసం ఏ రేంజ్ లో ఉంటుందో.. లేటెస్టుగా విడుదలైన 3.07 నిమిషాల ‘ఆర్.ఆర్.ఆర్’ ట్రైలర్ వెల్లడిస్తోంది. ఎన్టీఆర్ – రామ్ చరణ్ కలసి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నారని అర్థం అవుతోంది.
ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ – సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ‘ఆర్.ఆర్.ఆర్’ కు ఆయువుపట్టుగా నిలిచాయి. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్ – హాలీవుడ్ ముద్దుగుమ్మ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా మెప్పించారు. అజయ్ దేవగన్ – సముద్ర ఖని – శ్రియా లు సినిమాలో కొంత సేపే కనిపించినా ఆకట్టుకున్నారు. రూ.450 కోట్ల బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…