RRR : దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా అంటే చాలు.. మినిమం ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ. ఆ స్థాయిలో ఆయన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. గతంలో ఆయన తీసిన అన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అయితే హాలీవుడ్ మూవీలలో ఉండే సీన్లను రాజమౌళి కాపీ కొడతారంటూ ఆయనపై ఒక అపవాదు ఎప్పటి నుంచో ఉంది. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాల్లోని కొన్ని సీన్లను ఇతర హాలీవుడ్ మూవీలలోని సీన్లతో పోలుస్తూ కొందరు ఆయనను విమర్శించారు. ఇప్పటికీ అలా చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కావడంతో ఇందులో కూడా అలా హాలీవుడ్ సినిమాల్లోంచి కాపీ కొట్టిన సీన్లు ఏమైనా ఉన్నాయా.. అని కొందరు శూలశోధన చేశారు. ఈ క్రమంలోనే ఒక సీన్ మాత్రం అలా కాపీ కొట్టిందేనన్న విషయం మాత్రం స్పష్టమైంది.

ఇంగ్లిష్‌లో గతంలో వచ్చిన అద్భుతమైన సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్.. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సిరీస్‌లో అనేక క్యారెక్టర్లు ఉంటాయి. వాటిల్లో హీరో క్యారెక్టర్ జాన్ స్నో ఒకటి. ది బ్యాటిల్ ఆఫ్ బాస్టర్డ్స్ అనే యుద్ధంలో హీరో శత్రు రాజ్యానికి చెందిన సైనికులను చీల్చి చండాడుతూ ఉంటాడు. ఓ దశలో శత్రు సైనికులు జాన్ స్నోను ముట్టడిస్తారు. అయినప్పటికీ జాన్ మాత్రం వారితో పోరాటం చేస్తూనే ఉంటాడు. చివరకు మిత్ర రాజ్యానికి చెందిన రాజులు వచ్చి యుద్ధంలో పాల్గొంటారు. దీంతో జాన్ స్నో బతికిపోతాడు.
అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో ఉన్న ఆ సీన్.. ఆర్ఆర్ఆర్ లోని రామ్ చరణ్ ఇంట్రో సీన్‌ను పోలి ఉంటుంది. వాస్తవానికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చి చాన్నాళ్లు అవుతోంది. పైగా రాజమౌళి ఆ సిరీస్ అంటే ఎంతో ఇష్టం అని చెప్పారు. అందువల్లే అందులోని యుద్ధం సీన్‌ను కాపీ చేసి రామ్ చరణ్ ఇంట్రోను ఆ విధంగా తీశారని.. ఆయనపై విమర్శలు వస్తున్నాయి. జాన్ కూడా తన శత్రు సైనికులను అలాగే ఒకరి వెంట మరొకరిని చంపుతుంటాడు. ఇక ఆర్ఆర్ఆర్‌లో రామరాజు క్యారెక్టర్ కూడా నిరసన కారులు ఒకరి తరువాత మరొకరిని తప్పించుకుంటూ ముందుకు సాగుతాడు. పోల్చి చూస్తే ఆ సిరీస్.. ఈ సినిమాలోని రెండు సీన్లు దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అందుకనే రాజమౌళి ఈసారి కూడా కాపీ కొట్టి దొరికిపోయారని.. పలువురు విమర్శిస్తున్నారు. అయితే రాజమౌళికి మాత్రం అన్ని వర్గాల నుంచి మద్ధతు లభిస్తోంది.