RRR : రాజమౌళి సినిమా అంటే సామాన్యంగా అంచనాలు భారీగా ఉంటాయి. అందులోనూ మల్టీస్టారర్.. చిన్న హీరోలు కూడా కాదు ఒకరు మెగాపవర్ స్టార్, మరొకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. చరిత్రలో ఎన్నడూ కలవని ఇద్దరు గొప్ప వీరులను కలిపి చూపించే ప్రయత్నంగా ఆర్ఆర్ఆర్ అనే సినిమా తెరకెక్కించారు రాజమౌళి. ఈ సినిమాలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, గిరిజన వీరుడు కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్నారు.
బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేశారు జక్కన్న. అంతటి ఘన విజయం తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్స్ ను కూడా గమనిస్తూ వస్తున్నారు. తాజగా ఓ నెటిజన్ సినిమాలో ఐటం సాంగ్ ఉందా మావా.. అని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందాన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
దీనికి స్పందించిన చిత్ర బృందం.. ఏ నువ్వు చేస్తావా.. అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చింది. గతంలో కూడా ఇలా ఫన్నీ రిప్లైలు ఇవ్వడం మనం చూశాం. తాజా ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా ను గ్రాండ్ గా రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు మేకర్స్. భారీ ఎత్తున పదివేలకు పైగా స్క్రీన్స్ లో ఈ చిత్రం విడుదల కానుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…