RRR Movie : ఆర్ఆర్ఆర్ సినిమా కోసం యావత్ దేశం వేయి కళ్లతో ఎదురు చూడగా, ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్, ఎన్టీఆర్) లు హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు చెరిపేస్తోంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల సినిమాలు థియేటర్లలో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీ ఎంట్రీ ఎప్పుడనే దానిపై కూడా చర్చ ప్రారంభమైంది. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా థియేటర్లలో వచ్చిన కనీసం 90 రోజుల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఆర్‌ఆర్‌ఆర్ స్ట్రీమింగ్ హక్కులతో పాటు హిందీకి సంబంధించి శాటిలైట్ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇందుకుగాను జీ గ్రూప్ ఏకంగా రూ.300 కోట్లు వెచ్చించినట్లు సమాచారం. జూన్ రెండవ వారంలో ఆర్‌ఆర్‌ఆర్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని టాక్. ఇదిలా ఉండగా ఇంగ్లిష్, పోర్చుగీస్, కొరియన్, స్పానిష్ భాషలకు గాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్ తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్‌ను 2 నెలల్లోనే ఓటీటీకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారని మే 1వ తేదీ నుంచి దక్షిణాది భాషల్లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు జీ5 ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారాలు చేశారు.
ఇక హిందీ వెర్షన్ మాత్రం నెటిఫ్లిక్స్‌లో 3 నెలల తర్వాత అంటే జూన్‌లోనే స్ట్రీమింగ్ కానుందని చెప్పుకొచ్చారు. అయితే ఇవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. జూన్‌లో ఈ సినిమా ఓటీటీకి రానుందని టాక్. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా ఇందులో తారక్, చరణ్‌ల నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ విడుదలైన మూడో రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ. 500 కోట్ల క్లబ్‌లోకి చేరింది. ప్రస్తుతం రూ.700 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…