RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుతమైన మూవీల్లో ఆర్ఆర్ఆర్ ఒకటి. ఈ మూవీ ఇటీవలే రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. 60కి పైగా దేశాల్లో ఈ మూవీ ప్రదర్శితం అవుతోంది. దీంతో ఈ మూవీ టాప్ ట్రెండింగ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇందులో తారక్, చరణ్‌ల పెర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే ఇతర నటీనటులు కూడా అద్భుతంగా నటించారు. ఈ క్రమంలోనే ఈ మూవీ హాలీవుడ్ సెలబ్రిటీల ప్రశంసలను సైతం దక్కించుకుంటోంది.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటికే ఓటీటీల్లోకి వచ్చేసింది. ఈ మూవీకి చెందిన హిందీ వెర్షన్‌ను నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేస్తుండగా.. తెలుగు, ఇతర భాషలకు చెందిన వెర్షన్లు జీ5లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మూవీకి గాను అన్ని భాషలకు చెందిన హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తాజాగా కొనుగోలు చేసింది. దీంతో హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ మూవీని ప్రస్తుతం వీక్షించవచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో మాత్రం ఈ రేస్‌లో వెనుకబడిందనే చెప్పవచ్చు. కొత్త సినిమాలను కొనుగోలు చేయడంలో అమెజాన్ ప్రైమ్ దూకుడుగా వ్యవహరిస్తుంది. కానీ ఆర్ఆర్ఆర్‌ను ఎలా మిస్ అయ్యారు.. అన్న విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఇక మొత్తం 3 ఓటీటీల్లో ఈ మూవీ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఈ క్రమంలోనే ఓటీటీల్లోనూ ఈ మూవీ రికార్డులను సృష్టిస్తోంది.

కాగా రాజమౌళి ప్రస్తుతం మహేష్ తో చేయబోయే సినిమాకు గాను తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి కథను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్, అడ్వెంచర్ డ్రామాగా మహేష్ మూవీ ఉంటుందని చెప్పారు. దీంతో మహేష్ అభిమానులతోపాటు ప్రేక్షకుల్లోనూ ఈ మూవీపై ఇప్పుడే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు అన్ని పనులను ముగించుకోనున్నారని సమాచారం.