RRR Movie : దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాటు నాటు వీర నాటు సాంగ్ రిలీజై యూట్యూబ్ లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఇందులో చరణ్, తారక్ పోటీపడి మరీ డాన్స్ చేయడంతో నెట్టింట్లో ఈ పాట దుమ్ము లేపుతోంది.
సోషల్ మీడియాలో ఈ పాట ఎంతగా ట్రెండ్ అవుతుందో అదేవిధంగా రచయిత చంద్రబోస్ ను నెటిజన్లు అంతే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. తెలుగులో ఈ పాటను చంద్రబోస్ రాయగా ఇందులో కొన్ని తప్పులు ఉన్నాయి అంటూ నెటిజన్లు అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
పశువుల దాణాక్కూడా పనికిరాని ఎర్రజొన్నలతో రొట్టెలు.. పైగా అందులో మిరపతొక్క.. అదేవిధంగా కీసు పిట్ట కూసినట్టు అంటూ రాశారు.. కీసు పిట్ట అంటే విజిల్.. అనే కదా అర్థం.. విజిల్ ఎలా కూస్తుంది.. అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
ఏదైనా ఒక పదాన్ని అనువదించే ముందు దాని అర్థం పరమార్థం తెలుసుకొని రాయాలి కానీ.. ఇలా ఏది పడితే అది రాయడం ఏంటి చంద్రబోసు.. అంటూ నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ఇప్పటికే ఎన్నో వేల పాటలు రాసిన మీరు ఇలాంటి కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోతే ఎలా.. అని సోషల్ మీడియా వేదికగా చంద్రబోస్ కి నెటిజన్లు చుక్కలు చూపిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…