RRR Movie : ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. అందుకు అనుగుణంగా చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించింది. అయితే కోవిడ్ మూడో వేవ్ కారణంగా ఈ చిత్ర విడుదలను నిరవధికంగా వాయిదా వేశారు.
ఇటీవలే రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను రెండు విడుదల తేదీలను ప్రకటించారు. మార్చి 18 లేదా ఏప్రిల్ 28 తేదీల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. అయితే మార్చి 17న కన్నడ సూపర్ స్టార్ పునీత్ జయంతి సందర్భంగా ఆయన నటించిన సినిమాలను వారం రోజుల పాటు అక్కడ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. దీంతో ఇతర ఏ సినిమాలను ప్రదర్శించేది లేదని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు చెప్పారు. అందువల్ల మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల సాధ్యం కాదని అంటున్నారు. దీంతో ఏప్రిల్ 28 ఒక్కటే ఆప్షన్ మిగిలింది.
అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఏప్రిల్ 28 తేదీనే కన్‌ఫామ్ చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దర్శకుడు రాజమౌళి మళ్లీ ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
జనవరిలో సినిమా విడుదల వరకు దేశవ్యాప్తంగా చిత్ర యూనిట్ దాదాపుగా ప్రమోషనల్ కార్యక్రమాలను పూర్తి చేసింది. కానీ దురదృష్టవశాత్తూ చిత్ర విడుదల వాయిదా పడింది. దీంతో నిర్మాతకు కేవలం ప్రమోషనల్ కార్యక్రమాలకే రూ.30 కోట్ల మేర నష్టం వచ్చిందని అన్నారు. అయితే ఏప్రిల్ 28వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకే అధికంగా అవకాశాలు ఉన్నాయి కనుక.. అప్పటి వరకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారం నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలను మళ్లీ ప్రారంభిస్తారని తెలుస్తోంది. అందుకు గాను ఇప్పటి నుంచే రాజమౌళి గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. అయితే ఈసారైనా ఆర్ఆర్ఆర్ మూవీ ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలవుతుందా.. లేదా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…