RRR Movie : దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం.. ఆర్ఆర్ఆర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. బాహుబలి 2 లాగా కలెక్షన్లను సాధించలేకపోయినా.. భారీ ఎత్తున కలెక్షన్లను అయితే రాబట్టింది. ఇందులో కొమురం భీమ్‌గా ఎన్‌టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్‌లు యాక్టింగ్‌ను అదరగొట్టేశారు.
కాగా థియేటర్లలో ఇప్పటికే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఇక ఓటీటీలో రచ్చ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ మూవీకి గాను డిజిటల్ హక్కులను జీ5 సంస్థ ఇప్పటికే భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది. కనుక అదే ప్లాట్‌ఫామ్‌పై ఆర్ఆర్ఆర్ రిలీజ్ కానుంది. మే 20వ తేదీన ఆర్ఆర్ఆర్ ను జీ5 యాప్‌లో రిలీజ్ చేయనున్నారు. దీంతో ప్రేక్షకులకు మళ్లీ ఓటీటీ వేదికగా వినోదం లభ్యం కానుందని చెప్పవచ్చు.
ఇక జీ5లో ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. హిందీ వెర్షన్‌ను మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాకే విడుదల చేయనున్నారు. అయితే జూన్ మొదటి వారంలో ఈ మూవీ ఓటీటీలోకి వస్తుందని అనుకున్నారు. కానీ చాలా ముందుగానే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తుండడం విశేషం. ఇక ఓటీటీలో కూడా పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాను రిలీజ్ చేస్తారా.. లేక సాధారణంగానే రిలీజ్ చేస్తారా.. అన్న విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై మరిన్ని వివరాలను ఇంకో రెండు మూడు రోజుల్లో వెల్లడించే అవకాశం ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…