RRR Movie : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుండడంతో అంతర్జాతీయ స్థాయిలోనూ దీనికి ప్రశంసలు లభిస్తున్నాయి. ఎంతో మంది దర్శకుడు రాజమౌళిని, ఈ మూవీని పొడగ్తల్లో ముంచెత్తుతున్నారు. రాజమౌళి ప్రతిభను కొనియాడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో ప్రేక్షకులను ఆకట్టుకునే ఎన్నో సీన్లు ఉన్నాయి. కానీ వాటిల్లో బ్రిటిష్ వారిపై భీమ్ జంతువులతో దాడి చేసే సీన్ ఒకటి ఉంటుంది. ఇది సినిమా మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి.
ఇక ఈ సీన్‌ను పూర్తి స్థాయిలో వీఎఫ్ఎక్స్‌లోనే చిత్రీకరించారు. వాస్తవానికి అందులో జంతువులు ఏవీ లేవు. అవన్నీ గ్రాఫిక్సే కావడం విశేషం. అయితే ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌కు పనిచేసిన సూపర్‌వైజర్ శ్రీనివాస మోహన్ తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీకి చెందిన వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియోను షేర్ చేశారు. అది ఎంతగానో అలరిస్తోంది. అసలు జంతువులు ఏవీ లేకుండానే అవి ఉన్నట్లుగా ముందుగానే సీన్లను తీశారు. తరువాత వాటికి వీఎఫ్ఎక్స్‌ను జోడించారు. ఈ విషయం శ్రీనివాస మోహన్ షేర్ చేసిన వీడియోను చూస్తే అర్థమవుతుంది.
ఆర్ఆర్ఆర్ మూవీలో భీమ్ జంతువులతో కలిసి బ్రిటిష్ వారిపై దాడి చేసే సీన్‌లో అసలు జంతువులే లేవు. అయినప్పటికీ అవి దాడి చేసినట్లు, వాటి నుంచి తప్పించుకున్నట్లు ఎంతో చక్కగా సీన్లను తెరకెక్కించారు. ఇది రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆ సీన్‌కు చెందిన వీఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలు ఆ సీన్‌ను అలా ఎలా తీశారు.. అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…