RRR Glimpse : ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌చరణ్, తారక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో కొమురంభీమ్ పాత్రలో తారక్.. అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించనున్నారు.ద ర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది.
45 సెకన్ల నిడివితో విడుదలైన ఈ వీడియోలో చరణ్-తారక్ అందరినీ మెస్మరైజ్ చేశారు. ఒక్క వీడియోతో అందరి అంచనాలు తారా స్థాయికి చేరాయి. ప్రధాన పాత్ర ధారులు అందరూ టీజర్‌లో కనిపించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లుక్స్ కేక పెట్టించాయి. యుద్ధ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘భీమ్ ఫర్ రామరాజు’, ‘రామరాజు ఫర్ భీమ్’ వీడియోలు ప్రేక్షకుల్ని ఎంతగానో మెప్పించినప్పటికీ వాటిల్లో తారక్-చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించలేదు. ఈ ఇద్దరూ ఉన్న తొలి వీడియో ఇదే కావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియాభట్, ఒలీవియా మోరీస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు షిస్తున్నారు. సినిమా ఫైనల్‌గా 3 గంటల 15 నిమిషాలు వచ్చిందట. చివరగా జక్కన్న ఈ సినిమాను ట్రిమ్ చేసి చివరగా 2 గంటల 45 నిమిషాలకు అన్ని భాషల్లోనూ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఇధే ఫైనల్ అని కూడా చెబుతున్నారట. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను దుబాయ్‌లో నిర్వహించాలనే ప్లాన్‌లో ఉన్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…