Republic Movie : మెగా హీరో సాయిధరమ్ తేజ్.. దేవాకట్ట దర్శకత్వంలో నటించిన చిత్రం రిపబ్లిక్. సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన థియేటర్లో విడుదలయ్యింది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేదు.
ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే రిపబ్లిక్ సినిమా నవంబర్ 26 నుంచి ఓటీటీలో ప్రసారం కానుంది.
ఇక ఈ సినిమా విడుదల సమయానికి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో తన మేనమామలు మెగాస్టార్, పవర్ స్టార్ దగ్గరుండి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా వచ్చినప్పటికీ ఆ తర్వాత మాత్రం కలెక్షన్ల పరంగా తీవ్ర నిరాశ కలిగించాయి. థియేటర్లలో నిరాశ కలిగించిన ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి విజయాన్ని అందుకుంటుందో లేదో వేచి చూస్తే తెలుస్తుంది.