Renu Desai : మాస్ మహారాజ రవితేజ ఈ మధ్య కాలంలో పలు వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈయన నటించిన ఖిలాడి మూవీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది. అయితే ఈయన త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇక దీని తరువాత ఆయన చేయబోతున్న చిత్రం.. టైగర్ నాగేశ్వర్‌రావు. ఈ సినిమాను ఉగాది సందర్భంగా శనివారం అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితోపాటు పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఇక రేణు దేశాయ్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం ఎంతో మందికి షాకిచ్చింది. ఆమె మళ్లీ నటిస్తుందా.. అని అందరూ ఆశ్చర్యపోయారు. టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో రేణు దేశాయ్.. రవితేజకు సోదరిగా నటిస్తుందని తెలుస్తుండగా.. ఆమెది చాలా పవర్‌ఫుల్ రోల్ అని అందుకనే ఆమె ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక ఎంతో కాలంగా రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. కానీ యాక్టింగ్ చేయలేదు. దీంతో ఆమె మళ్లీ యాక్టింగ్ చేస్తుండడం ఫ్యాన్స్‌కు సంతోషాన్నిస్తోంది.
కాగా టైగర్ నాగేశ్వర్ రావు చిత్రం లాంచింగ్ సందర్భంగా రేణు దేశాయ్ ఒక విషయంపై మాత్రం పూర్తిగా క్లారిటీ ఇచ్చేశారు. తాను సినిమాల్లో నటించేందుకు సిద్ధమని చెప్పారు. కానీ క్యారెక్టర్ తనకు నచ్చాలని అన్నారు. టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో తన పాత్ర బాగుంటుందని.. అందుకనే తాను ఈ మూవీలో నటించేందుకు అంగీకరించానని తెలిపారు. అయితే ఈమె సినిమాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని క్లారిటీ ఇచ్చేశారు. కానీ తనకు కథ బాగా నచ్చాలని చెప్పారు. మరి నిర్మాతలు ఈమె కోరికకు అనుగుణంగా సినిమాలు తీస్తూ ఈమెకు ఆఫర్‌లు అందిస్తారో.. లేదో.. చూడాలి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…