realme C31 : మొబైల్స్ తయారీ సంస్థ రియల్‌మి.. కొత్తగా రియల్‌మి సి31 పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు. దీని ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. ఈ ఫోన్‌లో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదలైంది.

ఇక ఈ ఫోన్‌లో మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. రెండు సిమ్‌లు, ఒక మెమొరీ కార్డును వేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో వెనుక వైపు 13 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న మెయిన్ కెమెరా ఉండగా.. దీనికి తోడు అదనంగా మరో 2 మెగాపిక్సల్ కెమెరాను, ఇంకో వీజీఏ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్రెయిట్ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది.
ఈ ఫోన్‌లో డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0 వంటి ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తోంది.
ఇక రియల్‌మి సి31 స్మార్ట్ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.8,999 ఉండగా.. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999గా ఉంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను రియల్‌మి ఆన్‌లైన్ స్టోర్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో విక్రయించనున్నారు.