Ravi Teja : నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ అంటూ ఇటు సినిమాలు, అటు డిజిటల్ మీడియా రంగంలోనూ దూసుకుపోతున్నారు. అన్‌స్టాపబుల్ అంటూ టాలీవుడ్ ప్రముఖులతో రచ్చ చేస్తున్న బాలయ్య ఇప్పటికే అయిదు ఎపిసోడ్లు పూర్తి చేశారు. ఇక ఆరో ఎపిసోడ్ సైతం సిద్దం అయింది. ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – బాలయ్య సందడి చేయనున్నారు. క్రిస్మస్ నాడు ఈ ఎపిసోడ్ విడుదల కానుంది.
తాజాగా ఎపిసోడ్ 7 ప్రోమో బయటకు వచ్చింది. అందులో బాలయ్యలో కొత్త జోష్ కనిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజతోపాటుగా దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య ఇంటస్ట్రింగ్ ప్రశ్నలు.. అదే సమయంలో పంచ్ లు వేస్తూ కొత్త ఎనర్జీతో కనిపించారు. ఎపిసోడ్ మొదట్లో బాలయ్య మాట్లాడుతూ.. ‘నీకు నాకు పెద్ద గొడవ అయ్యిందటగా ముందు ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వు’ అని అడగ్గా.. దానికి రవితేజ స్పందిస్తూ.. ‘పనీపాట లేని డ్యాష్‌గాల్లకు ఇదే పని’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇక రవితేజపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలపై కూడా ప్రశ్నించారు బాలయ్య. ‘హెల్త్‌కు, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే నీ మీద డ్రగ్స్ కేసు పెట్టారు’ అని అడగగా.. రవితేజ బదులిస్తూ.. ‘మొదట నాకే ఆశ్చర్యమేసింది. బాధ ఎక్కడ పడ్డానంటే.. పెంట పెంట చేశారు. అది కొంచెం బాధేసింది’ అని మనసులో మాటను బయటపెట్టాడు రవితేజ. కాగా ఈ ఎపిసోడ్ ప్రేక్షకులకి మంచి వినోదం పంచేలా కనిపిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…