Rashmika Mandanna : తెలుగు ప్రేక్షకులకు రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఛలో అనే సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తరువాత పలు హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప వంటి సినిమాలతో ఈమె పాపులర్ అయింది. ఈ క్రమంలోనే నేషనల్ క్రష్‌గా కూడా మారింది. ప్రస్తుతం ఈమెకు బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇక రష్మిక మందన్న కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా.. పలు బ్రాండ్లను ప్రమోట్ చేయడం ద్వారా కూడా బాగానే సంపాదిస్తోంది.
రష్మిక మందన్న వద్ద విలాసవంతమైన కార్లు, దుస్తులు, హ్యాండ్ బ్యాగ్‌లు, బిల్డింగ్‌లు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమె ప్రస్తుతం ఒక్క సినిమాకు రూ.4 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈమె ఆస్తులు రూ.80 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. వాటిల్లో చాలా వరకు ఖరీదైన కార్లు, ఇళ్లే ఉన్నాయి. ఈమెకు బెంగళూరులో రూ.8 కోట్లు విలువ చేసే ఇల్లు ఒకటి ఉంది. అలాగే ముంబైలోనూ అత్యంత ఖరీదైన ఏరియాలో ఈ మధ్యే ఒక ఇంటిని కొనుగోలు చేసింది.
ఇక రష్మిక మందన్న వద్ద కార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వాటిల్లో రూ.50 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ సి క్లాస్ కార్, రూ.40 లక్షలు విలువ చేసే ఆడి క్యూ3 కారు, టయోటా ఇన్నోవా, హుండాయ్ క్రెటా కార్లు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ మధ్యే మిషన్ మజ్ను అనే మూవీ షూటింగ్‌ను పూర్తి చేసింది. అలాగే అమితాబ్ బచ్చన్‌తో కలిసి గుడ్‌బై అనే మూవీలో నటిస్తోంది. త్వరలో రామ్ చరణ్‌తో మూవీ చేయనుంది. పుష్ప 2 షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. దుల్కర్ సల్మాన్‌తో కలిసి సీతా రామమ్ అనే మూవీలో నటిస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…