Rashmika Mandanna : పుష్ప సినిమా పాన్ ఇండియా లెవల్‌లో విడుదలై మంచి హిట్ టాక్‌ను సాధించడంతో.. అందులో నటించిన చాలా మంది నటీనటులకు మంచి పేరు వచ్చింది. ఇక హీరోయిన్ రష్మిక మందన్న అయితే పుష్ప సినిమాతో ఒక రేంజ్‌కు వెళ్లిపోయింది. ఆమెకు బాలీవుడ్‌లో పలు సినిమాల్లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడిని మరో ఆఫర్ వరించిందని తెలుస్తోంది. రామ్ చరణ్ 16వ సినిమాలో రష్మిక మందన్నకు చాన్స్ ఇచ్చారని తెలుస్తోంది.

రామ్ చరణ్ తేజ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో ఓ యాక్షన్ థ్రిల్లర్ రూపొందనుంది. అందులో ముందుగా దిశా పటానిని హీరోయిన్‌గా ఎంపిక చేయాలనుకున్నారట. కానీ ప్రస్తుతం ఆలిండియా లెవల్‌లో రష్మిక మందన్నకు విపరీతమైన క్రేజ్ వచ్చిన కారణంగా ఆమె అయితేనే ఈ చిత్రానికి మంచి ఊపు వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నదట. అందువల్లే రామ్ చరణ్ 16వ సినిమాలో ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేయాలని చూస్తున్నారట.
ఇక ఇందులో భాగంగానే రష్మికతో ఇప్పటికే దర్శక నిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే రష్మిక ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుండడంతోపాటు పుష్ప 2వ పార్ట్‌లో యాక్ట్ చేస్తోంది. మరి ఆమె కాల్ షీట్స్ లభిస్తాయా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అన్నీ కుదిరి ఆమె హీరోయిన్‌గా ఎంపికైతే మాత్రం రామ్ చరణ్ కు జోడీగా రష్మిక బాగా సెట్ అవుతుందని అంటున్నారు. దీంతో ఆ సినిమా కూడా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఇక ఈ మూవీలో రామ్ చరణ్‌ను గతంలో ఎన్నడూ లేనివిధంగా చూపిస్తారని తెలుస్తోంది. పూర్తి స్థాయి యాక్షన్ జోనర్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. దీంతో ఫ్యాన్స్‌కు మంచి వినోదం లభ్యం కానుంది.