Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదనే విషయం మనకు తెలిసిందే. తన ఫిట్‌నెస్ కోసం ఎక్కువగా కష్టపడుతూ భారీ వర్కౌట్స్ చేస్తూ అందాన్ని రెట్టింపు చేసుకుంటోంది.

ఇక సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఫోటోని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. రష్మిక జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ ఉన్న సమయంలో మిర్రర్ లో సెల్ఫీ దిగి ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫోటోలో టైట్ పాయింట్ వేసుకొని అసలైన నడుము అందాలను చూపిస్తూ సెల్ఫీ దిగింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. స్థిరత్వంతో, వర్కౌట్‌తో, ఫిజియోతో, డైట్‌తో, ఆలోచనలతో, మీ ప్రయాణంతో స్థిరంగా ఉండండి, ఎంజాయ్ చేయండి.. అంటూ చెప్పుకొచ్చింది. ఇలా గ్లామరస్ ఫొటోల ద్వారా అందాలను ఆరబోస్తూ ఫొటోలకు పోజులు ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ ఫొటోలను చూస్తూ పలువురు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.