Rashmika Mandanna : పుష్ప సినిమాతో రష్మిక మందన్న స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ఈమెకు బాలీవుడ్‌లో అనేక అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె ఓ వైపు హిందీ సినిమాల్లో నటిస్తూనే మరో వైపు తెలుగులోనూ యాక్ట్ చేస్తోంది. ఇక ఈమె తెలుగులో రీసెంట్‌గా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాను పూర్తి చేసింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

రష్మిక మందన్న సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఓ వైపు పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను ఈమె ప్రమోట్ చేస్తూనే.. మరోవైపు గ్లామరస్ ఫొటోషూట్స్ చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ అమ్మడు చేసిన బ్లాక్ డ్రెస్ ఫొటోషూట్ అదిరిపోయింది. ఇందులో రష్మిక అందాలు వర్ణించనలవి కాకుండా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
రష్మిక ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది. అలాగే హిందీలోనూ పలు మూవీల్లో నటిస్తోంది. అవి ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.