Rashmika Mandanna : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా, బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈ ముద్దుగుమ్మ నటుడు వరుణ్ ధావన్ తో కలిసి రచ్చ చేసింది.

తమిళంలో విజయ్ హీరోగా పూజా హెగ్డె హీరోయిన్ గా నెల్సన్ దీలిప్ కుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బీస్ట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాలెంటెన్స్ డే సందర్భంగా ఈ చిత్రం నుంచి అరబిక్ కుత్తు పాటను విడుదల చేశారు. ఈ పాట విడుదలైన 24 గంటలకే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించింది. ఇక ఈ పాటకు ఎంతో మంది సెలబ్రిటీలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
View this post on Instagram
తాజాగా ఈ పాటకు రష్మిక, హీరో వరుణ్ ధావన్ తో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసింది. డ్యాన్స్ చివర్లో వరుణ్ ని రష్మిక టీజ్ చేస్తూ ఆటపట్టించిన తీరు ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక రష్మిక బాలీవుడ్ ఇండస్ట్రీలో “గుడ్ బై”, ” మిస్టర్ మజ్ను” చిత్రాలలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.