Rashmi Sudheer : బుల్లితెరపై మోస్ట్ ఎంటర్ టైనింగ్ కపుల్ ఎవరు అంటే యాంకర్ రష్మి, సుడిగాలి సుధీర్ అనే విషయం స్సెషల్ గా చెప్పక్కర్లేదు. వీరి యాంకరింగ్ కి తోడుగా ఈ జంట కెమిస్ట్రీ ఓ రేంజ్ లో క్లిక్ అయ్యింది. వీరిద్దరూ కలిసి చేసే ప్రోగ్రామ్ కి స్పెషల్ క్రేజ్ ఉంటుంది. బుల్లితెర ప్రేక్షకులకు వీరి జంట అంటే ప్రత్యేకమైన అభిమానం. కామెడీ చేస్తూ.. ప్రేక్షకుల్ని నవ్వించే వీరిద్దరూ పెళ్ళి చేసుకోవాలని ఎంతోమంది అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
అలాగే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో తరచూ ఏవో గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. యూట్యూబ్ లో సైతం రష్మి, సుధీర్ కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఆఫ్ స్క్రీన్ లో వీరిద్దరూ ఎలా ఉంటారో తెలీదు గానీ.. ఆన్ స్క్రీన్ లో మాత్రం సుధీర్, రష్మీలను చూడటం ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే వీరిద్దరి కెమిస్ట్రీ కూడా చూడముచ్చటగా ఉంటుంది. ఎన్ని ప్రోగ్రామ్స్ లో వీరి ప్రేమ గురించి గాసిప్స్ వచ్చినా.. తామిద్దరం కేవలం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ వచ్చే వార్తల్ని కొట్టిపడేస్తుంటారు.
కానీ టీవీ ఛానల్స్ వాళ్ళు మాత్రం తమ రేటింగ్స్ స్పెషల్ ప్రోగ్రామ్స్ లో రష్మి, సుధీర్ లకు పెళ్ళి చేశారు. అలాగే రీసెంట్ గా జరిగిన ఓ ప్రోగ్రామ్ లో కూడా రష్మి తన ప్రేమను ప్రదర్శిస్తూ.. సుధీర్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. కానీ లాస్ట్ లో మాత్రం తను సుధీర్ ను లవ్ చేస్తున్నట్లు క్లారిటీ ఇవ్వలేదు. లేటెస్ట్ సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో కొన్ని వార్తలతోపాటు ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ చూసిన ప్రేక్షకులు, నెటిజన్లు.. రష్మీ, సుధీర్ లు ఎంగేజ్ మెంట్ ఎప్పుడూ చేసుకున్నారని షాక్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు నెట్టింట్లో తెగ వెతుకులాట మొదలు పెట్టారు. ఈ ఫోటోలు కూడా ఓ ప్రోగ్రామ్ కి సంబంధించినవి మాత్రమేననే.. ఆన్ స్క్రీన్ కోసమే ఈ జంట ఇలా ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్లు ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఏది ఏమైనా సుధీర్, రష్మీలు రియల్ లైఫ్ లో కూడా ఒక్కటైతే బాగుంటుంది.. అనేది అందరి అభిప్రాయం.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…