Ranbir Kapoor Alia Bhatt : బాలీవుడ్ ప్రేమ జంటల్లో ఒకటైన రణబీర్ కపూర్, ఆలియా భట్‌లు ఎంతో కాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లి అదిగో జరుగుతుంది.. ఇదిగో జరుగుతుంది.. అన్ని ఇన్ని రోజులూ వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు వారి పెళ్లి గురువారం జరిగిపోయింది. బుధవారం మెహిందీ ఫంక్షన్ జరిగింది. ఈ క్రమంలోనే గురువారం ఇద్దరూ హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కేవలం కొద్ది మంది స్నేహితులు, సన్నిహితులు, బంధువులతోపాటు కుటుంబ సభ్యుల సమక్షంలో వారి పెళ్లి అయింది.

కాగా రణబీర్-ఆలియాల పెళ్లికి వచ్చిన కొందరు అతిథుల ఫోన్లను కూడా కవర్లలో చుట్టి బంధించారు. వారి వివాహం తాలూకు ఫొటోలు కానీ.. వీడియోలు కానీ.. ఎక్కడా బయటకు రాకుండా వారు జాగ్రత్త పడ్డారు. ముంబైలోని ఆర్‌కే రెసిడెన్సీలో వీరి వివాహం జరిగింది.
అయితే వీరు ఈ నెల 17వ తేదీన ముంబైలోనే గ్రాండ్‌గా రిసెప్షన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆ వేడుకకు అందరినీ ఆహ్వానించినట్లు సమాచారం. ఆ ఫంక్షన్‌కు ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా ప్రత్యేక విమానంలో వెళ్తుందని తెలుస్తోంది. ఇక ఆలియా భట్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆమె పాత్ర చిన్నదే అయినా ఆమెకు ప్రత్యేక ఆదరణ లభించిందనే చెప్పాలి.