Rana : బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు రానా. ఆయన ఇప్పుడు నటుడిగానే కాదు విలన్‌గా, హోస్ట్‌గా, ప్రమోటర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న రానా ఇప్పుడు సోనీ లీవ్ ఓటీటీ ని ప్రమోట్ చేసేందుకు కూడా ముందుకు వచ్చారు.
అయితే రానా నటించిన విరాట పర్వం చిత్రం కరోనా వలన వాయిదా పడుతూ వస్తుంది. ఏప్రిల్ 30న విడుదల కావల్సిన ఈ చిత్రం వాయిదా పడగా, ఇప్పటికీ రిలీజ్ డేట్ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ వెబ్ సైట్ తప్పుడు కథనం ప్రచురించింది. ‘విరాట పర్వం’ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ ఒక వెబ్‌సైట్ ఆర్టికల్ ను పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ లింక్ షేర్ చేస్తూ.. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Yavadu bro neeku chepindhi 😂😂 nee sodhi… https://t.co/ofG6xYGZt5
— Rana Daggubati (@RanaDaggubati) November 2, 2021
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం చిత్రాన్ని వేణు ఊడుగుల తెరకెక్కించగా, ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌లు అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.