Ram Charan Tej : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి రోజుకో విశేషం బయటకు వచ్చి ఫ్యాన్స్ కు పండగ చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన సాంగ్‌లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్, బ్రెజిల్, ఆఫ్రికా, యూరప్ తదితర దేశాలకు చెందిన 80 మంది డాన్సర్లు పాల్గొననున్నారట. 10 రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించనున్నారట.
తమన్ స్వరపరిచిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారని ఈ సెట్ కోసం రూ.40 కోట్లను ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. పది రోజుల పాటు ఆ అదిరిపోయే లొకేషన్‌లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సాంగ్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో డ్యాన్సర్లు ఇప్పటికే బస చేస్తున్నారు. ఇప్పటి వరకు మరే తెలుగు సినిమాకు కూడా ఈ రేంజ్ లో ఫారిన్ డ్యాన్సర్ లను ఇండియాలో వాడలేదని అంటున్నారు.
రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్యమైన పాత్రలలో నటించనున్నారు. ప్యాన్ ఇండియా లెవల్‌లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాక్ నడుస్తోంది. ఈ విషయంలో అధికారిక సమాచారం అయితే వెలువడాల్సి ఉంది. ఇందులో చరణ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించి సందడి చేయనున్నాడు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…