Ram Charan : టాలీవుడ్ లో అత్యధిక స్టార్స్ మెగా ఫ్యామిలీకి చెందినవారే. చిరంజీవి అనే వటవృక్షం క్రింద అరడజనుకు పైగా హీరోలు పుట్టుకొచ్చారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ స్టార్స్ గా ఎదిగారు. అలాగే సాయి ధరమ్, వరుణ్ తేజ్, వైష్ణవ్, అల్లు శిరీష్ మోస్తరు హీరోలుగా రాణిస్తున్నారు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కాస్తా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీగా విడిపోయాయని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాక ఈ దూరం మరింత పెరిగిందని, కొన్నాళ్లుగా అల్లు అర్జున్ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్నారని. ఆయన అల్లు రామలింగయ్య మనవడిగా పిలవబడడానికి ఇష్టపడుతున్నాడని, మెగా ట్యాగ్ ఆయనకు నచ్చడం లేదని సమాచారం.
ఇటీవల ఓ సందర్భంలో బన్నీ.. అవర్ ఫౌండేషన్ అంటూ అల్లు రామలింగయ్య ఫోటో పోస్ట్ చేశాడు. దీంతో తన అభివృద్ధికి కారణం తాతయ్య కానీ, మేనమామ కాదని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. చిరంజీవి ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాల ముందు వరకు రామ్ చరణ్ సినిమా కథలు ఎంపిక చేసే బాధ్యతను కూడా అల్లు అరవింద్ కే అప్పగించారు. ఆ టైంలో రామ్ చరణ్ కు వరుస ప్లాపులు పడడంతో (ముందు తాను విన్న మంచి కథలు బన్నీకి బ్లాక్ చేసేవాడని టాక్) కథలు వినే బాధ్యతను అరవింద్ నుంచి తప్పించి చరణ్ సినిమా కథలను కూడా చిరంజీవి విని ఓకే చేస్తున్నాడు. గత రెండేళ్లుగా బన్నీ నందమూరి హీరోలకు బాగా దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్, బన్నీ బావా బావ అని ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. ఒకరి సినిమా రిలీజ్ అయినప్పుడు మరొకరు అభినందనలు చెప్పుకుంటున్నారు.
అలాగే నందమూరి కాంపౌండ్ సీనియర్ హీరో బాలయ్యను అల్లూ ఫ్యామిలీ ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ కు తీసుకువచ్చి ఏకంగా అన్‌స్టాపబుల్ టాక్ షో చేయించారు. ఈ టాక్ షో సూపర్ హిట్ అవడంతో బాలయ్య.. అల్లు బంధం మరింత బలపడింది. ఇలా అనేక పరిణామాలు అల్లు – మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ పెరుగుతుందన్న సందేహాలు పెంచేశాయి. అయితే కొన్నాళ్ల క్రితం అల్లు అరవింద్.. అల్లు స్టూడియోస్ పేరిట స్టూడియో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారట. చిరంజీవి ఈ స్టూడియోను ప్రారంభిస్తే మెగా ఫ్యామిలీల మధ్య దూరం పెరిగిందన్న పుకార్లకు కొంతవరకైనా చెక్ పెట్టినట్టు అవుతుందన్నదే అరవింద్ ప్లాన్‌గా తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…