Ram Charan : కీర్తి సురేష్ నటించిన తాజా చిత్రం గుడ్ లక్ సఖి. షూటింగ్ కథాంశం నేపథ్యంలో కొనసాగనున్న ఈ మూవీలో జగపతి బాబు కీలకపాత్రలో నటించారు. ఇటీవలే ఈ మూవీకి చెందిన ట్రైలర్ విడుదల కాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని జనవరి 28వ తేదీన విడుదల చేయనున్నారు.
కాగా గుడ్ లక్ సఖి చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా హాజరు కావల్సి ఉంది. కానీ ఆయనకు కరోనా సోకడంతో ఆయన తనయుడు రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చరణ్ చిత్ర యూనిట్‌కు విషెస్ చెప్పారు. ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. మహానటి ఉండగా.. చిత్రం ఎలా ఫ్లాప్ అవుతుంది, విజయం సాధించి తీరుతుందని చరణ్ అన్నారు.
ఇక నగేష్ కుకునూర్ సినిమాలు ఆసక్తికరంగా ఉంటాయని రామ్ చరణ్ అన్నారు. గత చిత్రాలు హైదరాబాద్ బ్లూస్, ఇక్బాల్‌లపై చరణ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా చరణ్ మరోమారు గుడ్ లక్ సఖి చిత్రానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కాగా ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ఆర్ఆర్‌లో పాపులర్ అయిన నాటు నాటు సాంగ్‌కు రామ్ చరణ్, కీర్తి సురేష్‌లు స్టెప్పులేసి అందరినీ అలరించారు. మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ చేసిన సినిమా కావడంతో చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…