Rajnikanth : తమిళ సూపర్ స్టార్ కొద్ది రోజుల క్రితం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోగా, ఆ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా కనిపించారు. కానీ ఉన్నట్టుండి ఆయన ఆసుపత్రిలో చేరారు. దీంతో అభిమానులు ఆందోళన చెందారు. ఏటా నిర్వహించే సాధారణ హెల్త్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన సతీమణి తెలిపారు. రజనీకాంత్ ఎప్పటిలాగానే సాధారణ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఏడాదికి ఒకసారి ఆయనకు ఇలాంటి పరీక్షలు చేయడం సహజమే అని లతా రజనీకాంత్ పేర్కొన్నారు.
గురువారం సాయంత్రం రజనీకాంత్ చెన్నైలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు. రజనీకాంత్ కావేరీ ఆస్పత్రిలో చేరిన విషయం బయటకు తెలియడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తలనొప్పి, అస్వస్థత కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారనే ప్రచారమూ జరిగింది. గురువారం రాత్రి రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన కుమార్తె ఐశ్వర్య కావేరి ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులెవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రజనీ సన్నిహితులు తెలుపుతున్నారు.
రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తె’ తెలుగులో ‘పెద్దన్న’గా రాబోతోంది. ఈ మేరకు బుధవారం చిత్ర యూనిట్ పెద్దన్న మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. ఈ చిత్రంలో హీరో రజనీకాంత్‌కు చెల్లెలి పాత్రలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటించింది. మరోవైపు నయనతార, మీనా, ఖుష్బూ వంటి నటీమణులు కీలక పాత్రలను పోషించారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…