Rajinikanth : తమిళ నటుడు అయినప్పటికీ రజనీకాంత్ గ్లోబల్ స్టార్ అన్న విషయం విదితమే. ఈయన సినిమాలు జపాన్ వంటి దేశాల్లోనూ ప్రదర్శితమవుతుంటాయి. అందుకనే ఆయన అందరికీ పరిచయం అయ్యారు. ఇక రజనీకాంత్ ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు. అందుకనే ఆయన తరచూ హిమాలయాలకు వెళ్తుంటారు. ఇక ఈ మధ్యే ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. తన జీవితంలో ఎన్నో అనుభవించానని చెప్పిన ఆయన.. తనకు ప్రశాంతత మాత్రం కరువైందని అన్నారు. అలాగే ఆనందం అనేది లేకుండా పోయిందని తెలిపారు.
జీవితంలో తాను ఎంతగానో పేరు, ప్రఖ్యాతులను సాధించానని రజనీకాంత్ తెలిపారు. అలాగే ఎంతో డబ్బు సంపాదించానన్నారు. కానీ తనకు ఆనందం, ప్రశాంతత అనే రెండు లభించడం లేదన్నారు. అవి మనుషులకు దొరకడం అసంభవం అని ఆయన వైరాగ్యపు మాటలు మాట్లాడారు. తాను హిమాలయాలకు వెళ్తుంటే కాసేపు ఆత్మ సంతృప్తి లభిస్తుందన్నారు. కానీ అది తాత్కాలికమేనని.. ఆనందం, ప్రశాంతత అనేవి ఎల్లప్పుడూ ఉండవని అన్నారు. అయితే తన ప్రవర్తన చూసి కొందరు సన్యాసులు అయితే.. కొందరు తరచూ హిమాలయాలకు వెళ్తున్నారని అన్నారు.
ఇక రజనీకాంత్ ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాప్ లను ఎదుర్కొంటున్నారు. ఆయన నటించిన 2.0 తరువాత ఏ మూవీ కూడా హిట్ కాలేదు. ఈ క్రమంలోనే రజనీ కెరీర్ ఇక ముగిసినట్లేనని అంటున్నారు. ఇక ఆయన ప్రస్తుతం జైలర్ అనే మూవీలో నటిస్తున్నారు. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే రజనీకాంత్ ఆ స్థాయిలో ఉండి కూడా ఇలా మాట్లాడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆయనకు ఏయే విషయాల్లో ఆనందం, ప్రశాంతత లేవు.. అని అందరూ చర్చించుకుంటున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…