Rajendra Prasad : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుల్లో రాజేంద్రప్రసాద్ కూడా ఒకరు. ఆయన చేసిన పాత్రలు, కథలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసినవే. హాస్యానికి పెద్దపీట వేస్తూ.. ఛాలెంజింగ్ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ప్రతీ పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటనకు తగిన అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఇంత విశేషమైన ఆదరణ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఒక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. అయితే ఈయన ఆత్మహత్య చేసుకోవాలనిపించిన కారణాలేంటో చూద్దాం.
1956వ సంవత్సరంలో నిమ్మకూరులో పుట్టిన రాజేంద్రప్రసాద్ సిరామిక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో డిప్లోమా కంప్లీట్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్ కూడా అదే ఊర్లో ఉండటం వల్ల ఆయన ఇంటికి వెళ్ళడంతో నటనపై రాజేంద్రప్రసాద్ కు ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్.. రాజేంద్రప్రసాద్ ను తీసుకుని చెన్నైలో ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేర్పించారు. అందులో రాజేంద్రప్రసాద్ గోల్డ్ మోడల్ సంపాదించారు. తమ తల్లిదండ్రులు ఇంత చదువు చదివి యాక్షన్ లో ట్రైనింగ్ తీసుకుని ఖాళీగా ఉంటున్నావని అనడంతో రాజేంద్రప్రసాద్ ఫీల్ అయ్యారట.
అందుకే ఇంటి నుండి డబ్బులు పంపొద్దని, ఫిల్మ్ ఇండస్ట్రీలో చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగేవారట. ఇండస్ట్రీలో ఎవరూ తనకు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్నారు. అలాగే జీవితంలో ఎన్నో బాధల్ని దిగమింగుకుని, ఇక భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఆ తర్వాత పుండరీకాక్షయ్య సినిమాకు రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ చెప్పే అవకాశం రావడంతో అప్పటి నుండి రాజేంద్రప్రసాద్ కు వరుస అవకాశాలు వచ్చాయని అన్నారు.