Mahesh Babu : మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి రాజ‌మౌళి ప్రామిస్.. సినిమా గ‌ట్టిగానే ఉంటుంది మ‌రి..!

Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో మ‌రో బిగ్గెస్ట్ హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్న‌రాజమౌళి ఇప్పుడు మ‌హేష్ సినిమా కోసం స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఈ మూవీపై కూడా అభిమానుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మహేష్ బాబు కోసం రాజమౌళి ఎలాంటి కథ సిద్ధం చేస్తున్నారు.. ఎంత బడ్జెట్.. ఇలాంటి ఆసక్తికర చర్చ అభిమానుల్లో మొదలైంది. మహేష్, రాజమౌళి తొలి కలయికలో రాబోతున్న చిత్రం ఇది. ఈ చిత్రం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉండబోతున్నట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ కూడా తాను ఈ స్టోరీ లైన్ పైనే వర్క్ చేస్తున్నట్లు.. మరికొన్ని ప్రత్యామ్నాయ కథలు కూడా ఉన్నట్లు తెలిపారు.

Mahesh Babu

అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి రాజ‌మౌళి మాట్లాడుతూ.. ఇది బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోంది. బలమైన ఎమోషనల్ కోర్‌తో పూర్తిగా ఆకట్టుకునే యాక్షన్ అడ్వెంచర్ అవుతుంది. మ‌హేష్ లార్జ‌ర్ ద్యాన్ లైఫ్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. వారికి తప్ప‌క అదిరిపోయే ఫీస్ట్ ఇస్తాన‌ని అన్నారు రాజ‌మౌళి. మరోవైపు.. మహేష్ బాబు సర్కారు వారి పాట ఒక పాట మినహా షూటింగ్‌ను ముగించారు. తాజాగా మేకర్స్ ట్విట్టర్‌లో ఒక ప్రకటన విడుదల చేయడం ద్వారా అదే విషయాన్ని ధృవీకరించారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను పరశురామ్ తెరకెక్కించారు. జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

రాజమౌళి ప్రాజెక్ట్‌తోపాటు మ‌హేష్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఇందులో పూజా హెగ్డెతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు. ఇక రాజ‌మౌళి సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్‌ సరసన హిందీ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Share
Sunny

Recent Posts

టెన్త్‌, ఇంట‌ర్‌, డిప్లొమా చ‌దివిన వారికి ఉద్యోగాలు.. ఆన్‌లైన్‌లో అప్లై చేయండి..!

అస్సాం రైఫిల్స్ వారు ప‌లు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు గాను ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల…

Friday, 14 March 2025, 10:39 AM

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

బ్యాంకుల్లో ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేయాల‌ని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బ‌రోడా గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. ఆ…

Sunday, 2 March 2025, 2:33 PM

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న వారి కోసం యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…

Saturday, 22 February 2025, 10:19 AM

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

ప‌బ్లిక్ సెక్టార్‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి గాను ఆస‌క్తి,…

Friday, 21 February 2025, 1:28 PM

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

దేశంలోని ప్ర‌ముఖ ప‌బ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థుల నుంచి ప‌లు…

Thursday, 20 February 2025, 5:38 PM

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

రైల్వేలో ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభ‌వార్త చెప్పింది. ప‌లు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…

Tuesday, 18 February 2025, 5:22 PM

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవ‌కాశం అని చెప్ప‌వ‌చ్చు. ఇండియ‌న్ ఎయిర్…

Monday, 17 February 2025, 9:55 PM

పోస్ట‌ల్ శాఖ‌లో 45వేల ఉద్యోగాలు.. రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూ లేకుండానే ఎంపిక‌.. టెన్త్ చ‌దివితే చాలు..!

పోస్ట‌ల్ శాఖ‌లో ఉద్యోగం చేయాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ స‌ద‌కాశం మీకోస‌మే. త‌పాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…

Monday, 17 February 2025, 3:09 PM