Rain Alert : రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కాగా మరో మూడు రోజుల పాటు ఏపీ, తెలంగాణలలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం అధికారులు తెలియజేశారు.
దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరాల నుంచి వాయువ్య, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీంతో తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలియజేసింది. కాగా మిగతా రోజుల్లో ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
కాగా తెలంగాణలో అనేక చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా శుక్రవారం తెలంగాణలో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, కామారెడ్డిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇక ఈ జిల్లాలకు గాను ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేశారు.
ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ జిల్లాలకు గాను ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే 9వ తేదీన మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతోపాటు అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ క్రమంలోనే శనివారం ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేశారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…