Rahul Ramakrishna : మీకు ఒక పాత పులి కథ గుర్తుందా.. అందులో ఒక కుర్రాడు పొలం పనులు చేసుకుంటున్న తన తండ్రి, ఇతరులను ఆట పట్టించడం కోసం అదిగో పులి.. అని రెండు సార్లు అరుస్తాడు. వారు నిజంగానే పులి వచ్చిందేమోనని రెండు సార్లు అతని వద్దకు పరుగెత్తుతారు. ఇక ఇదేదో బాగుందని అనుకున్న అతని వద్దకు మూడోసారి నిజంగానే పులి వస్తుంది. అయితే ఈ సారి అతను పులి వచ్చిందని నిజంగానే అరుస్తాడు. కానీ అతన్ని ఎవరూ నమ్మరు. చివరకు అతన్ని పులి నోట కరుచుకు పోతుంది. అవును.. కమెడియన్ రాహుల్ రామకృష్ణను చూస్తే అచ్చం అలాగే అనిపిస్తోంది.
ఎవరితో జోక్స్ అయినా చేయవచ్చు. కానీ ప్రేక్షకులను ఆట పట్టించకూడదు. అది రివర్స్ అవుతుంది. కమెడియన్ రాహుల్ రామకృష్ణ గతంలో ఒకసారి తాను ట్విట్టర్ నుంచి దూరమవుతున్నానని.. ఇక ట్విట్టర్‌ను వాడబోనని చెప్పాడు. తరువాత కొన్ని రోజులకే ట్విట్టర్‌కు వచ్చాడు. ఇక ఇటీవల తాను సినిమాల్లో నటించబోనని, 2022 తనకు ఆఖరని, ఈ ఏడాది తరువాత సినిమాల్లో నటించేది లేదని.. చెప్పాడు.
అయితే అతను చెప్పింది అంతా నిజమే అని ప్రేక్షకులు నమ్మారు. అతను ఇంత సడెన్ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా.. అని తీవ్రంగా ఆలోచించారు. అలాంటి నిర్ణయం తీసుకోకు.. అని హితవు పలికారు. అయితే తీరా చూస్తే అదంతా వట్టిదే అని.. అతను జోక్ చేశాడని అర్థమైంది. ఆ విషయాన్ని అతనే మళ్లీ వెల్లడించాడు. దీంతో రాహుల్ తీరుపై ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.
ఇలాంటి విషయాలపై జోక్ చేయడం ఏంటి ? రాహుల్ ఇదేం పని, ఇలా చేయవచ్చునా.. ఇకపై నువ్వు ఏదైనా చెబితే ప్రేక్షకులు నమ్ముతారా..? ఒక వేళ నీకు నిజంగానే ఏదైనా అవసరం పడి నువ్వు ట్వీట్ చేస్తే అప్పుడు అది నిజమే అని ఎవరైనా నమ్ముతారా ? ఇలాంటి సెన్సిటివ్ విషయాలపై ఎల్లప్పుడూ జోక్స్ వేయకు.. అని నెటిజన్లు అతన్ని విమర్శిస్తున్నారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…