Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డె హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం.. రాధే శ్యామ్. ఈ మూవీ ఇప్పటికే విడుదల కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్‌లో ప్రభాస్, పూజా హెగ్డెల మధ్య వచ్చిన పలు రొమాంటిక్ సీన్లు ఎంతో క్యూట్‌గా ఉన్నాయి.

రాధే శ్యామ్ వాలెంటైన్స్ డే స్పెషల్ టీజర్‌లో పూజా హెగ్డె చివరి సీన్ లో ప్రభాస్‌ను పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. అని అడుగుతుంది. అన్ని మంచి క్వాలిటీలు ఉన్నా.. ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు.. అంటుంది. అందుకు ప్రభాస్ నీళ్లు నములుతాడు.
వాస్తవానికి ప్రభాస్‌ను రియల్ లైఫ్‌లోనూ ఈ ప్రశ్న ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. ఆయన మీడియాతో ఎప్పుడు మాట్లాడినా పెళ్లి ప్రస్తావన తెస్తారు. వాటికి ఆయన బదులివ్వరు. ఇక రాధేశ్యామ్ సినిమాకు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా.. ఈ మూవీని మార్చి 11వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.